Church Information

కనపర్రు (పల్నాడు జిల్లా)

గుంటూరు మేత్రాసనంలో కనపర్రు గ్రామము విశిష్టమైన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ గ్రామ కతోలికులు 300 సంవత్సరాల చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉన్నారు. ఈ గ్రామ దేవాలయం మొట్ట మొదటి సారిగా 1865 సం॥లో నిర్మించడమైనది. 18వ శతాబ్దం మధ్యలో కొందరు కమ్మవారు కథోలికులుగా మారడం జరిగింది. 1998లో దేవాలయ శత వార్షిక ఉత్సవాలకు సన్నద్ధమవుతూ దేవాలయ పైకప్పును పునర్నిర్మించి, శత వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది.

2023వ సంవత్సరంలో దేవాలయ 125 వసంతాల జూబ్లీ సందర్భంగా ఎత్తయిన నూతన గోపురాలను నిర్మించుకొని, దేవాలయాన్ని పొడిగించి నూత్నీకరించటం రించటం జరిగింది. గ్రామము నుండి 47 మంది కన్యాస్త్రీలు, 15 మంది గురువులుగా అభిషేకించబడి ఉన్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 200 లోపు కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.