ఈ గ్రామం ప్రారంభంలో మొట్టమొదటి సారిగా 1947 స॥లో చిన్న గుడి ఉండేది. తరువాత ప్రస్తుత దేవాలయం 1967 సం॥లో నిర్మించడమైనది. తిమ్మరాయని పహాడ్ గ్రామ పూర్వ పెద్దలు 1924 సం||లో గుంటూరు జిల్లా ప్రాంతం లోని వివిధ గ్రామాల నుంచి 8 కుటుంబాలవారు వచ్చి భూములు కొని స్థిరపడ్డారు. క్రమేణ వారి బంధువులు చాలా కుటుంబాల వారు వచ్చారు. వచ్చినవారందరూ “కమ్మ కథోలికులు” కావడంవలన గురువులను కలిసి ప్రారంభంలో చిన్న గుడి తరువాత పెద్ద దేవాలయంను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో 350 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.
తిమ్మరాయనిపహాడ్ గ్రామం నుండి 45 మంది గురువులుగా, 44 మంది కన్యాస్త్రీలుగా అభిషేకించబడినారు. దేవాలయం నిర్మాణం చేయుటకు గ్రామస్థులు, గురువులు, మేత్రాణులు తమ సహాయ సహకారాలను అందించారు. 2017 సం లో స్వర్ణ జూబిలీ వేడుకలు నిర్వహించడమైనది. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21, 22 తేదీలలో గ్రామ దేవాలయ ఉత్సవాలు నిర్వహిస్తారు.
