ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1931 సం॥లో నిర్మించడమైనది. తదనంతరం 1978 మే 19 న నూతన దేవాలయాన్ని ఘన బెరిట్టా ఏలినవారిచే ప్రతిష్టించబడినది. గ్రామ పూర్వ పెద్దలు 1917 పింగళనామ సంవత్సరంలో శిరిమామిళ్ళ శిరిపురం, తాళ్ళచెరువు, గారపాడు మరియు కొంకవారిపాలెం నుండి రావటం జరిగినది. ప్రస్తుతం గ్రామంలో సుమారు 250 లోపు కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.
