Church Information

అత్తలూరు (గుంటూరు జిల్లా)

ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1937 సం॥లో నిర్మించడమైనది. అత్తలూరి గ్రామ పూర్వ పెద్దలు 18వ శతాబ్ధం ప్రారంభంలో వ్యవసాయం నిమిత్తం ఈగ్రామానికి వచ్చి స్థిరపడినారు. 18వ శతాబ్దం మధ్యలో కొందరు కమ్మవారు కథోలికులుగా మారడం జరిగింది. తదనంతరం ఈగ్రామం నుండి పలు కమ్మ కథోలిక కుటుంబాలవారు ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో సుమారు 140 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.