ఈ గ్రామంలో మొట్టమొదటి సారిగా 1953 సం॥లో పునీత కార్మిక జోజప్ప గారి దేవాలయం నిర్మించారు. తదనంతరం ప్రస్తుత దేవాలయాన్ని 2014 సం॥లో పునఃనిర్మించారు. మొదటగా ఈ గ్రామానికి వచ్చిన పెద్దలు పాత రెడ్డిపాలెం గ్రామంలో 1850 ప్రాంతాల్లో కథోలిక మతం స్వీకరించిన తర్వాత 1860 ప్రాంతంలో అక్కడ నుంచి గాలిపాలెం, అక్కడ నుంచి 1887 ప్రాంతంలో మఠంపల్లి, అక్కడ నుంచి 1905 ప్రాంతంలో అనాజిపురం గ్రామానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ గ్రామంలో సుమారు 30 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.
