ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1943 సం॥లో కర్ణం చిన్నప్పగారి సహకారంతో పునీత శౌరివారి దేవాలయం నిర్మించ బడినది. కట్రపాడు గ్రామ పూర్వ పెద్దలు 17వ శతాబ్ధం ప్రారంభంలో వ్యవసాయం నిమిత్తం ఈగ్రామానికి వచ్చి స్థిరపడినారు. 18వ శతాబ్దం మధ్యలో కొందరు కమ్మవారు కథోలికులుగా మారడం జరిగింది. తదనంతరం ఈగ్రామం నుండి పలు కమ్మ కథోలిక కుటుంబాలవారు ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు మరియు ఇతర దేశాలకు వలస వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో సుమారు 150 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.
