నరసరావుపేట-చిలకలూరిపేట ప్రధాన రహదారిపై, కనపర్రు గ్రామ ప్రవేశ ద్వారంలో “కనపర్రు బావి”గా పిలువబడే ప్రాంతంలో అద్భుత శక్తి గల దివ్య బాలయేసు పుణ్యక్షేత్రం వెలసి ఉంది. ఈ గ్రామ దేవాలయ ప్రతిష్ఠ 2000 సం॥లో నిర్వహించారు. ఆల్ఫోన్స్ ఫాదర్ గారు స్వప్నంలో బాలయేసు దర్శనమిచ్చి, దొంగల బారిన పడుతున్న ఆ ప్రదేశాన్ని పవిత్ర దేవాలయంగా మర్చమని సూచించినట్లు తెలిపారు. తదుపరి 2010సం॥లో శ్రీ పూదోట జయప్రసాద్ రాజా గారు (కనపర్రు మాజీ సర్పంచ్), పుణ్యక్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తూ, ఆవరణలో 14 స్థలాలు మరియు కల్వరి కొండ శిలువను, గ్రోటోను, అన్నదాన శిబిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత, పూదోట పాపయ్య గారి కుటుంబ సభ్యులు భారతీయ సాంప్రదాయానికి అనుగుణంగా దేవాలయ ప్రాంగణంలో జయస్తంభాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయ ప్రతిష్ట జరిగిన నాటి నుండి నేటి వరకు వేలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి అనేక మేలులను పొందుతున్నారు. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు 2026లో జరుపబడును.
