ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1978 సం||లో నిర్మించడమైనది. జాడి జమాల్పూర్ గ్రామ పూర్వ పెద్దలు 18వ శతాబ్ధం ప్రారంభంలో వ్యవసాయం నిమిత్తం ఈ గ్రామానికి వచ్చి స్థిరపడినారు. 18వ శతాబ్దం మధ్యలో కొందరు కమ్మవారు కథోలికులుగా మారడం జరిగింది. తదనంతరం ఈ గ్రామం నుండి పలు కమ్మ కథోలిక కుటుంబాలవారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో సుమారు 200 లోపు కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి
