Church Information

నీలా క్యాంప్ (నిజామాబాద్ జిల్లా)

ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1977 సం॥లో నిర్మించడమైనది. నీలా క్యాంప్ గ్రామం పూర్వం 1949 సం॥లో పెద్దలు అయిన, దాసరి చిన్న ఇన్నయ్య, దాసరి రాయన్న, దాసరి పెద్ద ఇన్నయ్య, నావిడి చిన్నయన్, బెల్లంకొండ చిన్నయ్య కుటుంబాలు గుంటూరు జిల్లాలోని పెద్దపరిమి గ్రామం నుండి ఇచ్చటికి వచ్చి భూములు కొనుగోలు చేసి స్థిరపడ్డారు. తదుపరి వారి బంధు మిత్రులు ఇంకకొన్ని కుటుంబాలు తాళ్ళచెఱువు నుండి వచ్చినారు. క్రైస్తవులతోపాటు హైందవ కుటుంబాలు కూడ వచ్చినారు. ఈ గ్రామంలో 70 కుటుంబాలు వున్నాయి.