Church Information

పాతరెడ్డి పాలెం, (చేబ్రోలు, గుంటూరు జిల్లా)

ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1897 సం॥లో నిర్మించడమైనది. పాతరెడ్డిపాలెం గ్రామ పూర్వ పెద్దలు 18వ శతాబ్దం ప్రారంభంలో వ్యవసాయం నిమిత్తం ఈ గ్రామానికి వచ్చి స్థిరపడినారు. 18వ శతాబ్దం మధ్యలో కొందరు కమ్మవారు కథోలికులుగా మారడం జరిగింది. తదనంతరం ఈ గ్రామం నుండి పలు కమ్మ కథోలిక కుటుంబాలవారు ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్ళడం జరిగింది. గ్రామము నుండి సుమారుగా 20 మంది కన్యాస్త్రీలు, 20 మంది గురువులుగా అభిషేకించబడి ఉన్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 100 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.