Church Information

రావిపాడు (పల్నాడు జిల్లా)

ఈ గ్రామ దేవాలయం మొట్టమొదటి సారిగా 1835 సం॥లో 25 కాథోలిక కుటుంబాల వారి సహకారంతో నిర్మించ బడినది. రావిపాడు గ్రామ పూర్వ పెద్దలు 17వ శతాబ్ధం ప్రారంభంలో వ్యవసాయం నిమిత్తం ఈగ్రామానికి వచ్చి స్థిరపడినారు. తదనంతరం ఈగ్రామం నుండి పలు కమ్మ కథోలిక కుటుంబాలవారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు మరియు ఇతర దేశాలకు వలస వెళ్లడం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో సుమారు 200 కమ్మ కథోలిక కుటుంబాలు ఉన్నాయి.